28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఖాయమైన డిచ్ పల్లి డివిజన్ 

Must read

📰 Generate e-Paper Clip

  •  బదిలీ ప్రకటన జారీ చేసిన ఎస్.ఈ.
  • ఈ నెల 31 వరకు డిఈ లకు ఆప్షన్స్ 
  • జనవరి 5 లోపు సీనియారిటీ జాబితా 
  • 10 లోగా ఉత్తర్వులు 
  • పారని ఉద్యోగుల పాచిక 
  • బతుకమ్మకు స్పందన 
  • అభినందనల వెల్లువ 

నిజామాబాద్, బతుకమ్మ:  వినియోగదారుల సౌలభ్యం కోసం డిచ్పల్లి డివిజనే ఖాయమైంది. పూర్తిస్థాయిలో డివిజన్ ఏర్పాటుకు సోమవారం సాయంత్రం సిబ్బంది ఎంపిక కోసం ఆప్షన్స్ ఉత్తర్వులను ఎస్ ఈ రవీందర్ జారీ చేశారు.  దీంతో ఓ అండ్ ఎం సిబ్బంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వారు సంబర పడుతున్నార.  డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుకు మోకాలొడ్డుతున్న వారి తీరుపై కిందిస్థాయి సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి వరుసగా రెండు రోజులు “బతుకమ్మ”లో కథనాలను వెలువరించింది. ఆప్షన్స్ అడుగుతున్నట్లు ఎస్.ఈ. ప్రకటన జారీ చేయడంతో డివిజన్ ఏర్పడినట్లేనని సహకరించిన బతుకమ్మకు అభినందనలు తెలిపారు.

డిచ్ పల్లి తగ్గేదేలే : డిచ్పల్లి గాకుండా నిజామాబాద్ రూరల్ అంటూ రాజకీయం మొదలెట్టిన వారి మొహాలు, ఆప్షన్స్ ప్రకటన వల్ల మాడిపోయాయినట్లు తెలిసింది. 2022 నవంబర్ 11న డిచ్పల్లిలో డివిజన్  ఏర్పాటుకై అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషి వల్ల మంజూరు అయింది. 2023 జనవరి 11న డివిజన్ ను ప్రారంభించాలని జీవోను వెలువరించారు. అప్పటినుంచి డిఈ ఉన్నప్పటికీ నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే విభాగం నడిచింది. పూర్తిస్థాయిలో పనులు జరగాలని కంపెనీ నుంచి ఆదేశాలు   రావడం మొదలెట్టాయి. దీంతో ఉద్యోగులు డిచ్పల్లికి వరకు వెళ్లి రావాలా.. అని నిజామాబాద్ రూరల్ పేరుతో కంపౌండ్ లోనే ఉంచాలని నాయకులు మోకాలడ్డుకునేలా ప్రయత్నాలు చేశారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా డిచ్పల్లి డివిజన్ ఏర్పాటు ఖాయమైంది.

సీనియారిటీ మెలిక :  నిజామాబాద్ రూరల్ ఏర్పాటు విషయంలోముందున్న నాయకులు సాయంత్రం  కాంపౌండ్ లోని అన్ని సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కాదని ఎస్ ఈ ఆప్షన్స్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఖంగు తిన్నారు. ఎలాగైనా డివిజన్ ఏర్పాటును అడ్డుకోవాలని కంకణం కట్టుకున్నవారు కొత్త రాగం తెర ముందుకు తెచ్చారు. ఇప్పటి ప్రకారం అయితే పదోన్నతి తీసుకున్నవారు నష్ట పోవాల్సి ఉంటుంది. విభజన చేయాలని వచ్చిన  అప్పటి తేదీ ప్రకారమే ఆప్షన్స్ తీసుకోవాలనే మెలికను ఎస్. ఈ. ముందు ఉంచి,   ఏ ప్రాతిపాదికాన తీసుకుంటారని నాయకులు ప్రశ్నించారు. మీ ప్రతిపాదనలను  సీఎండికి పంపి వివరణ తీసుకుంటామని, జారీ చేసిన ప్రకటన మాదిరిగానే బదిలీ ప్రక్రియ చేపడతామని ఎస్ ఈ రవీందర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.

 ఆప్షన్స్ ప్రకటన విడుదల :  డిచ్పల్లి డివిజన్లో పూర్తిస్థాయి సిబ్బందిని భర్తీ చేసేందుకు  ఆప్షన్స్ ఇవ్వాలని ఎస్ ఈ ప్రకటన జారీ చేశారు. ఈనెల 31 లోగా వారి డివిజన్ డీలకు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 5లోగా సీనియార్టీ జాబితా ప్రకటించిన తర్వాత 10 లోపు పోస్టింగ్ ఉత్తర్వులను జారీ చేయనున్నారు.

More articles

Latest article