30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నేను చేసిందే సర్వే.. నేను చూపిందే సరిహద్ధు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ భూమైనా.. పట్టా భూములైనా నేనే ఫైనల్
  • ఎమ్మార్వో చెప్పిన వినేది లేదు… డిఐ కి చెప్పిన తగ్గేదే లే
  • ఆన్ లైన్ వద్దు.. ఆఫ్ లైన్ ముద్దు
  • ఒక్కరి భూమికే డబుల్ సర్వే రిపోర్టులు ఇచ్చిన సర్వేయర్
  • సర్వేయర్ లీలలు.. సహ చట్టం ద్వారా వెలుగులోకి

నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఒక సర్వేయర్ వ్యవహరం సొంత శాఖకు తలనొప్పిగా మారింది. తాను చేస్తున్న సర్వేల తాలుకు వ్యవహరాలు ఆ శాఖాధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి.  తన పరిధిలోని మండలంతో పాటు మరో మండలానికి ఇంచార్జీగా వ్యవహరిస్తు ఏకఛత్రాధిపత్యం సాగిస్తుంది. కానీ అందులో తాను పని చేసే మండలంలోని తహసీల్ధార్ ను  కానీ తన శాఖ పరిధిలోని తన పై అధికారికి తెలియకుండానే సర్వేయర్ సర్వేలు చేయడం రిపోర్టులు ఇవ్వడం నిత్యతంతుగా మారింది. సీసీఏ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న లేదా ప్రత్యేక పరిస్థితులలో ఆఫ్ లైన్ ధరఖాస్తు చేసుకున్న సంబంధిత భూముల విషయంలో సర్వేలు చేసి హద్దులు చూపించాల్సిన చోట వాటిని పట్టించుకొని వైనం సహ చట్టం ద్వార వెలుగు లోకి వచ్చింది. ఇటీవల  మోపాల్ మండలం సిర్పూర్ శివారులో  అవదూత నిర్మలానంధ స్వామి ఆశ్రమానికి 1984 లో కేటాయించిన భూమి విషయంలో సర్వే కోసం ధరఖాస్తు చేయగా సర్వేయర్ కబ్జా దారుల పక్షం వహించిన విషయం విధితమే. సంబంధిత భూమి  5 ఎకరాలు ఉండగా ఏకంగా కబ్జాదారులతో సెటిల్ చేసుకొవాలని ఒప్పించే ప్రయత్నం చేసి అది కుదరకపొవడంతో ఏకంగా సంబందిత సర్వే రిపోర్టును రెండు విధాలుగా చేసి కొత్త టెక్నిక్ వ్యవహరం సహచట్టం బట్టబయలు చేసిన విషయం ఇటీవల బహిర్గతమైంది. అందులో మొదటి సర్వేలో ఆశ్రమ నిర్వాహకులను బోల్తా కొట్టించిన సర్వేయర్, చేయని సర్వెను చేసినట్టు తన శాఖా పై అధికారులకు తప్పుడు రిపోర్టు ఇచ్చి అడ్డంగా బుక్కైంది. అంతే గాక సదరు సర్వేయర్ రిపోర్టుల వ్యవహరం ఇప్పుడు మండలంలో హాట్ టాఫిక్ గా మారింది. ఈ నెల మొదటి వారంలో మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపిపి భర్త కు సంబంధించిన భూమి హద్దులను ఇతరులకు అవే సరిహద్దులుగా చూపి దాడులకు, ప్రతి దాడులకు, కేసులకు కారణ హేతువు అయ్యారని రెవిన్యూ, ల్యాండ్ సర్వే శాఖాలు కోడై కూస్తున్నాయి. తనకు ఆఫ్ లైన్ ముద్దు.. ఆన్లైన్  విధానం వద్దని కంకణం కట్టుకున్నట్టు సర్వేలు చేసిన విషయం వెలుగు లోకి వచ్చింది. సర్వేకు దరఖాస్తు చేసుకున్న వారితో కుదిరితే బేరం లేకపోతే పేచీలు అనే వ్యవహరం కామన్ అని సొంత శాఖ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. ఇక సర్వే విషయం అధికారులు, ఇతరులు ఎవ్వరు ఉన్న  లేకపోయిన తన భర్త ద్వార డీల్ సెట్ చేసుకుంటేనే ఫీల్డ్ లోకి దిగుతారని టాక్ ఉంది.  దరఖాస్తు దారులైన, ప్రత్యర్తి పార్టీ వారినైన తన ఇంటివద్ధకు రప్పించి అక్కడి నుంచి వ్యవహరం నడిపిస్తున్నట్లు సమాచారం. తన ఇంటిలోనే ఏకంగా జీరాక్స్ మెషిన్ పెట్టి, మ్యాప్ లను గీసివ్వడంతో పాటు ల్యాండ్ సర్వేకు సంబంధించిన టోచన్ మ్యాప్ ల గుట్టలతో మిని క్యాంపు ఆఫీస్ నడుపుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మోపాల్ మండలంలో ఒక్కటే భూమికి రెండు సర్వే రిపోర్టులు ఇచ్చిన సదరు సర్వేయర్ ఆన్ లైన్ సర్వేలను అటకెక్కించడం, ఆఫ్ లైన్ వాటిని ఆఘ మేఘాల మీద ముందుకు నడిపించడం వెన్నతో పెట్టిన విద్యా అనే విషయం సమచార హక్కు చట్టం ద్వార తేట తెల్లమైంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం సహ చట్టం దరఖాస్తు క్రింద మోపాల్ మండలం సర్వేయర్  ఇప్పటి వరకు ఎన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ సర్వేయర్ చేసిన సర్వే వివరాలు అడిగేతే అందులో ఇచ్చిన సమాచారం తో ఈ విషయం బహిర్గతమైంది. సంబంధిత సర్వేయర్ మోపాల్ లో విధులలో చేరిన నాటి నుంచి జూలై  30 వరకు 90 ల్యాండ్ సర్వే కోసం ధరాఖాస్తులు వచ్చాయని అవన్ని కుడా ఆఫ్ లైన్ మాత్రమేనని, ఒక్కటి కూడా ఆన్ లైన్ లేదని స్వయంగా అప్పటి పిఐఓ జయలక్ష్మి ( మోపాల్ నాయబ్ తహసీల్ధార్) ఇచ్చిన రిపోర్టులో ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మండంలంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఆన్లైన్ దరఖాస్తు రాకపోవడం పై అనుమానాలకు తావిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రెవిన్యూ భూమి ( అసైండ్ ) భూమి కలిగిన మోపాల్ మండలంలో భూ వివాధాలకు కొదవలేదు. ఇప్పటికే అక్కడ మొరం తవ్వకాల పేరిట వందల ఎకరాలు పరాధీనంలో ఉన్నాయి. రెవిన్యూ శాఖా భూములని రికార్డులు పక్కాగా ఉన్నచోట సర్వేయర్ సర్వే లీలలు ఒక్కొక్కటిగా బయటకి వస్తుండటం ల్యాండ్ సర్వే అధికారులకు షాక్ కు గురి చేస్తుంది. ఇటీవల సర్వేయర్ సంబంధించిన  సర్వే వివరాలు, తప్పుడు రిపోర్టులు బయటకు పొక్కడంతో  శాఖాధికారులపై సదరు సర్వేయర్ రుస రుసలాడినప్పటికి పక్కా ఆధారాలతో అవి దొరకడంతో ఏమీ చేయలేని పరిస్థితి దాపురించింది.

More articles

Latest article