29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గొప్ప వ్యక్తిత్వం దీన్ దయాల్  ఉపాధ్యాయ సొంతం

Must read

📰 Generate e-Paper Clip

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను బీజేపీలోని ప్రతికార్యకర్త పాటించాలని, అణగారిన వారి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీన్ దయాల్ 108వ జయంతిని పురస్కరించుకొని మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు గ్రామ గ్రామాన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో సుమారు వందమంది పార్టీలో చేరే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వానిది మొద్దు నిద్ర

భారీ వర్షాల కారణంగా రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లగా, అందులో ఎక్కువశాతం నష్టం నిజామాబాద్ జిల్లాలోనే జరిగిందని, రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని దినేశ్ విమర్శించారు. రుణమాఫీలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆర్మూర్ ప్రాంతం రైతులు ఆందోళనబాటపట్టారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న, పోతన్కర్ లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article