26.3 C
Hyderabad
Monday, August 3, 2026

‘జీవదాన్’ ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

. చిన్నారిపై పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని ఆగ్రహం

కామారెడ్డి, బతుకమ్మ:  ఆరేళ్ల చిన్నారితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగుచూడడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియతోపాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ధర్నా నిర్వహించారు. చిన్నారులకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఎదుట బైటాయించిన చైర్ పర్సన్ డీఈవోకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు. స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో తాము విద్యాశాఖ కార్యాలయానికి వస్తే పరిణామాలు వేరే ఉంటాయని స్పష్టం చేశారు. చైర్ పర్సన్ స్కూల్ ఎదుట బైటాయించడంతో నాయకులు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో  ఉద్రిక్తత నెలకొంది. పిల్లలను మధ్యలో నుంచే స్కూల్ నుంచి పంపించేశారు. పట్టణ సీ ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు.


Municipal chair person dharna in front of 'Jivadan'

More articles

Latest article