24 C
Hyderabad
Sunday, August 2, 2026

అధిక పింఛన్ ఇప్పిస్తానని దివ్యాంగుడిని మోసం

Must read

📰 Generate e-Paper Clip

ఎడపల్లి, బతుకమ్మ: ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ దివ్యాం గుడు రూ.4000 మోసపోయిన సంఘటన  చోటుచేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ఆఫీస్ లో పింఛన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లి అక్కడ  ఓ వ్యక్తి మాటలు కలిపి వికలాంగ ఫించన్ 4000 రూపాయలు కాకుండా అదనంగా 12000 రూపాయలు ఇప్పిస్తాను నమ్మించాడు. సాయిలును అతడు తన వెంట మండల తహసిల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే వుండే చెట్టు కింద కూర్చోబెట్టి అధిక డబ్బులు రావాలంటే కొందరికి డబ్బులు ఇవ్వాల తెలిపి అతని వద్ధ ఉన్న పింఛన్ డబ్బులు రూ.4 వేలు తీసుకున్నాడు. సాయిలును తహశీల్ధార్ కార్యాలయం సమీపంలోనే వుండే కెనరా బ్యాంక్ విత్‌డ్రా ఫామ్ పై సంతకం తీసుకొని 4000 రూపాయలకు చిల్లర తీసుకుని వస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని పారిపోయాడు. దాంతో బాధితుడు వెంటనే స్థానికులను పిలిచి, ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article