భీమ్ గల్, బతుకమ్మ : బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను పట్టణం లో ప్రసిద్ధ చొక్కయ్యగుట్ట హరి హర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, మాజీ ఎం. పీ. పీ కన్నె సురేందర్ దంపతుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకులను నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలతో కలిసి కన్నె దంపతులు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రజా సేవకుడు ముత్యాల సునీల్ కుమార్ కు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఆభగవంతుడు ఇవ్వాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగాణం లో అయ్యప్ప స్వాములకు భిక్షా, భక్తులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్నధానం కార్యక్రమం నిర్వహించారు. కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచారు.మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, పిల్లలకు స్వీట్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి,టౌన్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య, మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్, ఎస్సి సెల్ మండల ప్రెసిడెంట్ పర్స అనంతరావు, బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ కోరాడి రాజు, మండల మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కల్పన, శోభన్ రెడ్డి, పర్స రత్నం తదితరులు పాల్గొన్నారు.

