30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నందిపేట్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గా సిలిండర్ లింగం

Must read

📰 Generate e-Paper Clip

 నందిపేట్, బతుకమ్మ :

నందిపేట్ మండల సర్పంచ్  ల ఫోరం అధ్యక్షుడు నందిపేట సర్పంచ్ ఎర్ర సిలిండర్ లింగం ను ఎన్నుకున్నారు. బుధవారం నందిపేట్ మండల సర్పంచ్ ల అత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల పోరం నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు సిలిండర్ లింగం, ఉపాధ్యక్షులుగా అయిలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మి నారాయణ, మాయాపూర్ సర్పంచ్ బ్యాగరీ జీవన్ లను, కార్యధర్శిగా మంగ్లారపు సుప్రీయ, జాయింట్ సెక్రటరీ గోపి ముత్యం, కోశాధికారిగా ఆంధ్ర నగర్ సర్పంచ్ సుష్మ రామా క్రిష్ణ, అధికార ప్రతినిధిగా వెల్మల్ సర్పంచ్ గా గోజ్జి దేవేందర్ ను, అధికార ప్రతినిధిగా లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం ను సన్మానించి సత్కరించారు. సర్పంచ్ ల అభ్యున్నతికి, గ్రామ డెవలప్మెంట్ కోసం పాటు పడుతానని నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సిలిండర్ లింగం అన్నారు.

Cylinder Lingam as the President of Nandipet Mandal Sarpanch Forum

More articles

Latest article