29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

19 న ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో వంటల పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

 తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

బతుకమ్మ నిజమాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ పేరిట వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ నిర్వహకులు రత్నాకర్ తెలిపారు. పోటీలకు సంబంధించిన వివరాలను బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి  వెల్లడించారు.ఈ నెల 19 న పోటీలు రెండు రాష్ట్రాలలో  నిర్వహించి ఫైనల్ పోటీలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించి ఈ వంటల పోటీల్లో గెలిచిన వారికి ఉత్తమ బహుమతిగా ఎంపిక చేయనున్నట్లుతెలిపారు.అదేవిధంగా వంటల పోటీల్లో పాల్గొనే ఉత్సాహవంతులు ఏ రకమైన వంట చేయదలుచుకునే వారు ఆ రకమైన వంటకు సంబంధించిన మెటీరియల్స్ ఆ వంటలో వేసే మెటీరియల్స్ ను తీసుకోచ్చుకోవాలని,స్పష్టం చేశారు.వంటల్లో నైపుణ్యం చాటుకునేవారికి ఇలాంటి వేదిక గొప్ప అవకాశం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరుకానున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో తెలంగాణ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అక్షర, మాదూరిలు పాల్గొన్నారు.

More articles

Latest article