. గురుకుల విద్యార్థినులకు కామారెడ్డి కలెక్టర్ సంగ్వాన్ సూచన
కామారెడ్డి, బతుకమ్మ: విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్ కార్యక్రమాలు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్) ను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్ రూములను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ.. మంచి విద్యను అభ్యసించాలని, ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలని సూచించారు. భోజనం, విద్యా బోధన ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా? అని సిబ్బందిని అడిగారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రంగనాథ రావు, ఎస్సీ అభివృద్ధి అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ప్రిన్సిపాల్ వనిత, తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
