23.4 C
Hyderabad

ఇళ్ల స్థలాల హద్దులు చూపెట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ సబ్ కలెక్టర్ కు సీపీఎం వినతి

బోధన్ , బతుకమ్మ : చందూర్ మండల కేంద్రంలోని మర్రి బొగడ కాలోనిలోని ఇందిరమ్మ ఇళ్లకు హద్దులు చూపెట్టాలని సీసీఎం ఆధ్వర్యంలో బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడారు. ప్రభుత్వం హద్దులు చూపెట్టకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే హద్దులు చూపిస్తే నిర్మించుకుంటామని కోరారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సమస్య పరిష్కారం కొరకు ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే  దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, భూమయ్య, సాయిలు, బాగవ్వ, గంగామణి విజయ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article