24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు సిఎస్ఐ దూదిగాం విద్యార్థి ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ :  నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అండర్-14 బాలుర బీచ్ వాలీబాల్ పోటీలు జక్రాన్ పల్లీ మండలం కలిగోట్ లో నిర్వహించిన  పోటీల్లో సి ఎస్.ఐ దూదిగం పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రెండో స్థానంలో పిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చైతన్ అన్నారు. ఈ పోటీల్లో అనేక పాఠశాలలు పాల్గొనగా, సి.ఎస్.ఐ ధూదిగాం జట్టు క్రీడాస్ఫూర్తితో ఆకట్టుకుంది. జట్టులోని విద్యార్థి సుగంధర్ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని  ఆమె తెలియజేశారు. విద్యార్థులు కృషి, క్రమశిక్షణతో సాధించిన విజయమిది అని పేర్కొన్నారు. ఆమె సుగంధర్‌తో పాటు మొత్తం జట్టును అభినందించారు. పి.ఈ.టి. స్వామినాథ్ కూడా విద్యార్థుల కృషిని ప్రశంసించారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, టీమ్ స్పిరిట్ పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు  విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారనే ఆశాభావం వ్యక్తమైంది. ఈ విజయంతో సి.ఎస్.ఐ ధూధిగం పాఠశాల పేరు మరింత ప్రఖ్యాతి పొందింది. విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం గర్వం వ్యక్తం చేసింది. గ్రామ ప్రజలు కూడా విద్యార్థులను అభినందించారు. సి.ఎస్.ఐ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article