24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎస్సీ హెల్త్ కేర్.. వార్తలు రాస్తే ఫేక్ అంటా..

Must read

📰 Generate e-Paper Clip

  • వారు చేసే రక్త పరీక్షలు ఒప్పంటా 
  • లేబర్ కార్డు లేకుంటే ఆధార్ కార్డుపై..
  • సచ్చినోళ్ళ కార్డులనూ వదల్లేదు
  • బయటకొస్తున్నసి.ఎస్.సి బాగోతాలు 
  • మౌనదీక్షలో కార్మిక శాఖ           

 

హైదరాబాద్, బతుకమ్మ: ‘గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు’గా ఉంది సి.ఎస్.సి హెల్త్ కేర్ పరిస్థితి. ‘బతుకమ్మ’లో వరుస కథనాలు వస్తుండడంతో ఏమి పాలుపోలేక ఇదంతా ఫేక్ న్యూస్, దీనిని నమ్మొద్దని, ఇదే విషయాన్ని కార్మిక సంఘ నాయకులకు చెప్పాలని సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి ప్రతినిధులు హితబోధ చేసినట్లు తెలిసింది.  రక్త పరీక్షల పేరిట చేసేవన్నీ తప్పులే.. వార్తలు రాస్తే తప్పంట.. సి.ఎస్.సి హెల్త్ కేర్ చేసిన బాగోతాలను ‘బతుకమ్మ’ బహిర్గతం చేయడంతో ఏమి చేయలేని స్థితిలో పత్రికలో వచ్చేవి అన్నీ అసత్యపు వార్తలు, మనం చేసే పనులను చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని సంస్థకు దోచిపెడుతున్న ఉద్యోగులు, సిబ్బందికి చెప్పుకొస్తుండడం గమనార్హం.

  • కాలపరిమితి దాటినా (కార్డ్ ఎక్ష్పైరీ)..

కార్మికులు తీసుకున్న లేబర్ కార్డు ఐదేళ్ళ వరకు మాత్రమే పని చేస్తుంది. మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటే చెల్లుబాటవుతుంది. ఇక్కడ కార్డు కాలపరిమితి దాటిన వారిని సైతం విడిచిపెట్టకుండా రక్త పరీక్షలు చేసినట్టు చూపించి బిల్లులు తీసుకుంటున్నారు.  కార్డు ఉన్న కార్మికుడు చనిపోతే అది పనికి రాకుండా పోతుంది. ఇలాంటి కార్డులను సి.ఎస్.సి హెల్త్ కేర్ వదల్లేదు. కార్డు ఉన్న వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్తే, అతని భార్యకు రక్త పరీక్షలు చేసిన ఘనులు సి.ఎస్.సి హెల్త్ కేర్ సంస్థ వారు.

  • ఆధార్ కార్డు ఉందిగా..

రక్త పరీక్షల కోసం లేబర్ కార్డు తప్పనిసరి. దీని ఆధారంగానే సంస్థకు బిల్లులు మంజూరు అవుతాయి. ఏదైనా కార్డే కదా అని ఆధార్ కార్డ్ ఉపయోగించి కొందరికి  రక్త పరీక్షలు చేసారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్డు మీద రక్త పరీక్షలు చేసినా సరే, మాకు ఇచ్చేవి ఇస్తే బిల్లులను మంజూరుకు పంపిస్తామని కార్మిక శాఖ కమిషనరేట్ కార్యాలయపు అధికారులు చెప్తుండడం వల్లే సి.ఎస్.సి హెల్త్ కేర్ ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతుంది.

  • తప్పుల పరీక్షలు..

పరీక్షల కోసమని చిన్న మూడు బుడ్డిల నిండుగా రక్తాన్ని సేకరించి నింపుతున్నారు. వీటినైనా సక్రమంగా చేసి రిపోర్ట్స్ ఇస్తున్నారంటే అదీ లేదు. రక్తం తీసుకొని వెళ్ళడం వరకే హెల్త్ కేర్ విధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.  వైద్యుల సమక్షంలో జరగాల్సిన పరీక్షలు సర్టిఫికెట్లు లేనివాళ్ళు చేయడంవల్ల రిపోర్ట్లు తప్పుల తడకగా ఉంటున్నాయి. వీరి దగ్గర రక్త పరీక్ష చేయించుకుంటే లేని జబ్బులు, భయం గొలిపే విధంగా ఫలితాలను ఇస్తున్నారు. దీనివల్ల మానసిక దైర్యం కోల్పోయినవారు మంచమెక్కిన ఘటనలు ఉన్నాయి. కార్మిక నాయకుడు చల్ల శ్రీనివాస్ రావు సి.ఎస్.సి లో రక్త పరీక్ష చేయించుకుంటే చెడు కొవ్వు (ట్రైగ్లిజరైడ్స్) 550 పరిమాణంలో ఉందని ఇచ్చారు. దీంతో నెల రోజులుగా మానసిక వ్యధను అనుభవించాడు. ఇంటి వాళ్ళ ఓదార్పుతోపాటు, బలవంతంగా   వేరే దగ్గరకు తీసుకెళ్ళి ఈ పరీక్షను చేయించారు. అందులో 158 ఎంజి పరిమాణం వచ్చింది. సి.ఎస్.సి హెల్త్ కేర్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు ఉండడంతో అదే నిజమనుకొని నెల రోజులు మానసికంగా కుంగిపోయాడు. అనుభవరాహిత్యం వారు, సర్టిఫికెట్లు లేనివారు రక్త పరీక్షలు చేసి, తప్పుల తడక రిపోర్టులను చూపించడంతో లేని జబ్బులు ఉన్నాయని కార్మికులు భ్రమ పడుతున్నారు.

CSC Health Care.. if you write news, will it be called fake..

More articles

Latest article