29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

. . . రసాయనిక ఎరువులు తగ్గించి అప్పులేని వ్యవసాయం చేయాలని పిలుపు.

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో బుధవారం రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి విధానాల గురించి రైతులకు వ్యవసాయ అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని అప్పులేని వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు.సేంద్రీయ ఎరువులను వాడడం ద్వారా రైతులు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. నేల ఆరోగ్యం కాపాడుకొని దీర్ఘకాలికంగా మంచి దిగుబడులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ పద్ధతులను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఖర్చు తగ్గించుకొని లాభాలు పెంచుకునే మార్గాలను రైతులు అన్వేషించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి సాంకేతిక సలహాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఎర్వల, మండల వ్యవసాయ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article