ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి చేయాలి
. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి . . . రసాయనిక ఎరువులు తగ్గించి అప్పులేని వ్యవసాయం చేయాలని పిలుపు. బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో బుధవారం రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి విధానాల గురించి రైతులకు వ్యవసాయ అధికారులు...