. . . తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత
ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పార్టీలకు అతీతంగా రైతులందరూ కలిసి బస్టాండ్ శివాజీ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపి ధర్నా రాస్తారోకో ను జరిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ఒక దశలో ట్రాఫిక్ కు అంతరాయం జరిగింది. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడంతో ధాన్యం కుప్పలు తెప్పలుగా రైతుల కళ్లాల్లోనే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు కురిస్తే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల తేమ శాతంలో మార్పులు వచ్చి తూకంలో రైతులకు భారీ నష్టం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం రైతులు నల్ల జెండాలు ప్లే కార్డులతో రైతులకు న్యాయం జరగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి మండల తహసిల్దార్ జె మల్లయ్య కు వినతిపత్రం అందజేశారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరించాలని,నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే,రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ రైతులు,మండల పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.