సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలి

0 14,548
  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ 

 

కామారెడ్డి, బతుకమ్మ : అర్హులైన అందరికీ సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ వాన్  ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూములకు కూడా పంట రుణాలను అందజేయాలని ఆదేశించారు. వరదల వల్ల దెబ్బతిన్న ఎం ఎస్ ఎం ఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని ఆదేశించారు. డీఎఫ్ఎస్  ప్రవేశపెట్టిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్,2025 వరకు జరిగే క్యాంపెయిన్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ జూన్ త్రైమాసికంలో పంట రుణాలు స్వల్పకాలిక రుణాలు సకాలంలో అందజేశామని ఉద్దేశించిన లక్ష్యాలను సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డిఆర్డిఏ పిడి సురేందర్, ఆర్బిఐ ఎజిఎం రాములు, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, బ్యాంకర్లు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Crop loans should be sanctioned on time.

Leave A Reply

Your email address will not be published.