ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

0 14,595

మద్నూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలను బుధవారం మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎండి ముజిబ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాణి, మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల స్పెషల్ ఆఫీసర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం స్వీకరించారు. జాతీయ గీతంగా  ఆలపించారు. అనంతరం హాజరైన వారందరికీ ఆయా కార్యాలయాల్లో  స్వీట్స్ పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.