26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దేశంలో నాలుగు వేలకు చేరువలో కోవిడ్ కేసులు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్ 2 ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,900 దాటి నాలుగు వేల చేరువలో ఉంది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ లలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళ, కర్ణాటకలో కోవిడ్ తో రెండు మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  గడిచిన 24 గంటల్లో 360 కొత్త కేసులు నమోదయ్యాయి.

More articles

Latest article