27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయావరణలో సోమవారం ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి,మలి ఉద్యమాలలో అసువులు బారిన అమరవీరుల త్యాగఫలమే నేడు జరుపుకుంటున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, కేంద్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, చిట్టి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, కెపి సునీత, ప్రకాష్, కోశాధికారి దినేష్ బాబు, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, ఇందిర, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ , టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, రాజేశ్వర్, శ్రీరాములు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article