ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామానికి చెందినా బేగరి లక్ష్మీ శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు వెల్లుట్ల సంతోష్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఒట్లం భూమయ్య, నర్వ శంకర్, ప్రకాశ్, దేవరాజ్, మసాని పెట్ చిన్న సాయిలు, మెంబర్ కాశీరాం, గౌతమ్, విఠల్, రమేశ్, శేఖర్, రమేశ్, పోతురాజు సాయిలు, కొల్పుల కాశీరాం, సాయిలు తదితరులు ఉన్నారు.
