28.8 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో కాపర్ వైర్ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 40 వేల రూపాయల ఆస్తి నష్టం

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలంలోని గుర్జ కుంట గ్రామ శివారులో రైతు కందరి రమేష్, కుంట నడిపి మల్లారెడ్డి పంట పొలాలలో బుధవారం రాత్రి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని కాపర్ తీగలు, ఆయిల్ ను అపహరించారు. దీంతో కూరగాయల పంటలకు సాగునీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అపహరించిన వారిని త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

Copper wire stolen from electrical transformer

More articles

Latest article