బతుకమ్మ, ఏర్గట్ల: విద్యార్థులలో భాషపై మక్కువ పెంచడం కోసం మరియు వారికి చదవడం పై ఆసక్తి కల్పించడం కోసం,చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నుకోబడిన పాఠశాలలకు బాల చెలిమి గ్రంథాలయాలు ఏర్పాటుకు సహకారం అందిస్తున్నారు.దానిలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలకు సుమారు 30 నుండి 40 వేల రూపాయల విలువైన పుస్తకాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు.హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, చేతులమీదుగా చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మరియు బాల చెలిమి గ్రంథాలయాల నిర్వాహకులు మణికొండ వేదకుమార్, పాఠశాల గ్రంథాలయం కి అప్పటికప్పుడు కొన్ని పుస్తకాలు అందించారు.త్వరలోనే పాఠశాలలో బాల చెలిమి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల సాహిత్య కన్వీనర్ గరిపల్లి అశోక్, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని ఈ విధంగా ఏర్గట్ల పాఠశాల విద్యార్థులకు గ్రంధాలయానికి పుస్తకాలు అందిస్తున్నటువంటి అకాడమీకి తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ,ను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి, ఉపాధ్యాయులు బృందం అభినందించారు.
