- న్యాయమూర్తి నసీం సుల్తానా
బతుకమ్మ, ఆర్మూర్ : పంతాలకు పోకుండా రాజీ మార్గాన్నే ఎంచుకోవాలని, క్షణికావేశంలో కేసుల పాలు కావొద్దని ఆర్మూర్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి నసిం సుల్తాన ప్రజలకు హిత బోధ చేశారు.ఈ సందర్బంగా న్యాయ చైతన్య సదస్సు లో న్యాయమూర్తి నసిం సుల్తాన మాట్లాడుతు రాజి మార్గమే రాజా మార్గమని,కక్షి దారులు రాజీ కుదుర్చుకుంటే రాజ మార్గం ఏర్పడు తుందని,కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని అన్నారు.పంతాలకు పోకుండా రాజీ మార్గాన్నే ఎంచుకోవాలని సూచించారు.డబ్బును సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కోర్ట్ ల చుట్టూ తి రుగకుండా రాజి మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో పరిస్కారమైన కేసు వివరాలు సబ్ కోర్ట్ సివిల్ కేసులు 2,బ్యాంకు పియల్ సి 258 కేసులు, దాని రికవరీ రూపాయలు అరవై లక్షల నలభై రెండు వేల ఐదు వందల నలభై ఆరు, అలాగే జూనియర్ సివిల్ జడ్జీ వేముల దీప్తి ఆధ్వర్యంలో పిడిఎమ్ కోర్ట్ ఎమ్ సి లు మూడు కేసులు,క్రిమినల్ కేసులు 130,ఏడిఎమ్ కోర్ట్ క్రిమినల్ కేసు లు 87 మరియు సెకండ్ క్లాస్ కోర్ట్ లో మూడు వేల ఏడు వందలు కేసులను పరిష్కారించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పిపి శ్రీనివాస్ ఖాందేశ్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య,ఉపాధ్యక్షులు పోడేటి శంకర్, సెక్రటరి అరుణ్,న్యాయ వాదులు శ్రీధర్,జగన్,జిజి రాం,జీవన్, గణేష్,శ్రీకర్,కిరణ్,పోలీస్ సిబ్బంది, బ్యాంకు ఉన్నత అధికారులు,కక్షిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
