భవన నిర్మాణ రంగ కార్మికులపై చిన్నచూపు తగదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పిన హామీలను అధికారంలోకి రాగానే మరుస్తున్నారని బిఎన్ఆర్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం అన్నారు. పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలుగుతామని అందుకోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో భవన నిర్మాణ కార్మిక రంగాల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనను ఘనంగా సన్మానించారు. అవగాహన సదస్సులో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు...