27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోగొట్టుకున్న నగదు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : సిద్దిపేట జిల్లా మజీద్ పల్లి వర్గల్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన చింతల ముత్యాలు, తండ్రి పేరు లక్ష్మయ్య అను వ్యక్తి గత నెల15న తన గూగుల్ పే నుండి ఒక నెంబర్ తప్పుగా కొట్టడంతో ఆ డబ్బులు రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నర్సింలు అనే వ్యక్తికి పదివేల రూపాయలు పంపడం జరిగింది. దింతో లక్ష్మయ్య సోమవారం రోజున పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా, రుద్రూర్ ఎస్సై పి.సాయన్న ఆ వ్యక్తిని పిలిపించి అతని డబ్బులు 10 వేల రూపాయలు తిరిగి అందజేశారు. దీంతో లక్ష్మయ్య ఎస్సై పి.సాయన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article