27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అధికార లాంఛనాలతో కానిస్టేబుల్​ అంత్యక్రియలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్​​ అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, సీపీ సాయిచైతన్య మృతుడికి నివాళులర్పించారు. రౌడీషీటర్​ రియాజ్​ను స్టేషన్​ తరలిస్తున్న క్రమంలో నగరంలోని వినాయక్​నగర్​లో కానిస్టేబుల్​పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుల్​ ప్రమోద్​ మృతి చెందాడు.పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్​లోని న్యూ బ్యాంక్​ కాలనీలో ఉన్న ప్రమోద్ స్వగృహానికి ఇన్​స్పెక్టర్​ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అధికారిక లాంఛనాల మధ్య ప్రమోద్ అంత్యక్రియలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

Constable's funeral with full military honors

More articles

Latest article