అధికార లాంఛనాలతో కానిస్టేబుల్​ అంత్యక్రియలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్​​ అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, సీపీ సాయిచైతన్య మృతుడికి నివాళులర్పించారు. రౌడీషీటర్​ రియాజ్​ను స్టేషన్​ తరలిస్తున్న క్రమంలో నగరంలోని వినాయక్​నగర్​లో కానిస్టేబుల్​పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుల్​ ప్రమోద్​ మృతి చెందాడు.పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్​లోని న్యూ బ్యాంక్​ కాలనీలో ఉన్న ప్రమోద్ స్వగృహానికి ఇన్​స్పెక్టర్​...