సోయా రైతులకు భరోసా

0 14,571
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

మద్నూర్, బతుకమ్మ:  జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భరోసా కల్పించారు. సోయా ధాన్యం కొనుగోలు విషయం, రైతుల సమస్యల గురించి శనివారం రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగా రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఫోన్ లో మాట్లాడారు. వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపడుతామని ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగా రెడ్డి  ఎమ్మెల్యే కి తెలిపారు. రైతులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని ఎమ్మెల్యే ఢిల్లీలోని నాఫెడ్  అధికారులతో  కూడా మాట్లాడినట్లు తెలిపారు. వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోతే, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తానని ఎమ్మెల్యే సోయా రైతులకు భరోసా కల్పించారు. కాబట్టి రైతులు ఎవ్వరూ తొందరపడొద్దని, దళారుల మాటలు నమ్మి మోస పోవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.