25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నేరస్తుడు రియాజ్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ  విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో  నిందితుడు  రియాజ్ అరబ్  దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేటువంటి పోలీసుల పైన హత్యలు దాడులు చేయడం దుర్మార్గమైన పని పోలీస్ ప్రమోద్ పై కత్తిపోట్లు పొడిచి చంపిన నిందితుడు రియాజ్ ను వెంటనే పట్టుకొని నడిరోడ్డు పైన ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిజామాబాద్ సిపి ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, కార్తీక్, చంద్ర, అఖిలేష్, బాలకృష్ణ, గోపి,శ్రేయస్, మణికంఠ, రాజేష్,టోనీ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article