28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

 బాన్సువాడ, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ తో మృతి చెందాడు. బాన్సువాడ పట్టణంలో సిద్ధి గల్లి లో నివాసం ఉంటున్న కూరపాటి రఘు (42) మంగళవారం ఉదయం  వాంతులు చేసుకుని గుండెపోటుకు గురయ్యారు. అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందారు. కానిస్టేబుల్ గా రఘు గాందారి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. సోమవారం విధులు నిర్వహించిన రఘు ఉదయం వేళ విధి నిర్వహణ కోసం వేళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరుగడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రఘు కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాన్సువాడ లోని నివాసంలో రఘు మృత దేహానికి సిఐ తో పాటు ఎస్ఐ పోలీస్ సిబ్బంది నివాళ్లు అర్పించారు. ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పోలీసులు గుండెపోటుతో చనిపోయారు.

More articles

Latest article