24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 నిజామాబాద్ రూరల్ లోమహిళా సమాఖ్యకు 7 ఆర్టీసీ బస్సులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందల్వాయి, బతుకమ్మ:

 

కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు.  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల మహిళా సమాఖ్యలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు.  మంగళవారం ఉధయం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు 7 బస్సుల్లో హైదరాబాద్ కు బయలుదేరగా.. మంగళవారం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.అందులో భాగంగానే మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు, వ్యాపారాలు విస్తరించేందుకు ఒక్కో బస్సు పై రూ.6 లక్షలు మహిళా సంఘాల కాంట్రిబ్యూషన్ రూ. 30లక్షల బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణాలతో నియోజకవర్గ పరిధిలో 7 బస్సులు జిల్లా మొత్తంగా 28 బస్సులను ఈరోజు సీఎం చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. అటు మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడం .. మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇలా మహిళా సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్,బాగా రెడ్డి,ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మోపాల్ సాయిరెడ్డికి, బాల్ రాజు, సర్పంచ్ ఫోరం మండలాల అధ్యక్షులు వాసు, , శ్రీనివాస్, శ్యాంసన్, ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

7 RTC buses for the Women's Federation in Nizamabad Rural

More articles

Latest article