30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

తమిళనాడు సర్కారును కూల్చేందుకు కుట్ర

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రలోభాల ఎర

 

. . . కుట్రను భగ్నం చేసిన ఇంటలిజేన్స్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తమిళనాడు సర్కారును కులదోసేందుకు అప్పుడే కుట్రలు ప్రారంభమయ్యాయి. ఇళయ దళపతి విజయ్ ఆధ్వర్యంలో తమిళగ వెట్రి కజగం సర్కారును కూల్చేందుకు జరిగిన కుట్రను తమిళనాడు ఇంటలిజేన్స్ పోలసులు భగ్నం చేశారు. డియంకే సీనియర్ నేత, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఆదేశాలతో ఒక ప్రముఖ కన్సల్టేన్సీ అధికారితో పాటు ముగ్గురు వ్యక్తులు చేసిన కుట్ర బట్ట బయలైంది. టివికే ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ మార్చేలా చేస్తున్నారని వచ్చిన సమాచారంతో కుట్రను భగ్నం చేసి ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటలిజెన్స్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ తో డిఎంకే తీవ్రమైన రాజకీయంగా, చట్టపరమైన చిక్కుల్లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More articles

Latest article