రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిశీలన

0 14,740

బతుకమ్మ, బోధన్: భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని గ్రామ చవడిలో నిర్వహించిన సదస్సులో పాండు తరప్ప ప్రాంతానికి చెందిన రైతులు సమర్పించిన దరఖాస్తులను తహసీల్దార్ విట్టల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి దరఖాస్తును నిష్పాక్షికంగా పరిశీలించి, తగిన ఆధారాలతో నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.