మోర్తాడ్, బతుకమ్మ : మర్డర్ కేసు లో నిందితుడిని అరెస్టు చేసినట్లు భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తేదీ 26.06.2025 నాడు అర్ద రాత్రి సమయంలో డొంకల్ గ్రామం నందు వడ్డెర కాలనీ లో నిందుతుడు ఒల్లెపు నాగరాజు, అతని దగ్గర పనిచేసే షైక్ రహమాన్ లు మద్యం తగుతుండగా వారి ఇద్దరి మద్య డబ్బుల విషయం లో గొడవ జరగగా, ఆ సమయం లో నిందుతుడి ఒల్లెపు నాగరాజు షైక్ రహమాన్ ను కట్టేతో దాడి చేసి పారిపోయాడు. ఈ దాడి లో షైక్ రహమాన్ రక్త గాయాలతో ఆర్మూర్ ప్రభుత్వ హాస్పిటల్ నందు చనిపోయాడు. శుక్రవారం నమ్మ దగిన సమాచారం మేరకు భీంగల్ సీ ఐ పొన్నం సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్ఐ బి. రాము సిబ్బందితో కలిసి మోర్తాడ్ రైల్వే స్టేషన్ దగ్గర నిందుతుడు ఒల్లెపు నాగరాజు ను పట్టుకొని జైల్ కు పంపడం జరిగిందని భీంగల్ సీఐ పేర్కొన్నారు.
