27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి పునాది

Must read

📰 Generate e-Paper Clip

  • జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం
  • మున్నూరు కాపు సంఘం గ్రామ అధ్యక్షులు బైరి రవి

 

ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రత్యర్థి అభ్యర్థులతో బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించడం హర్షించ దగ్గ విషయమని ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు, మున్నూరు కాపు సంఘం గ్రామ అధ్యక్షులు బైరి రవి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు పాటుపడుతూ అభివృద్ధి పనులలో పురోగతి సాధించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి సహకరించాలన్నారు.

More articles

Latest article