- ఇందిరా గాంధీ ఓ నియంతలా వ్యవహరించారు
- బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమర్జెన్సీ నిర్వహించి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమెర్జెన్సీ టైం చీకటి రోజులు.. ఇందిరా గాంధీ కేవలం ప్రధాని పదవిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ నిర్వహించారని విమర్శించారు. ఇందిరా గాంధీ ఓ నియంతలా వ్యవహరించారన్నారు. అంబెడ్కర్ రాజ్యాంగాన్నిఇందిరా గాంధీ అపహాస్యం చేసిందన్నారు. ఎమెర్జెన్సీలో అనేక మంది బిజెపి, ఇతర ప్రతిపక్ష నేతలను జైల్లో వేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు తమ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఢిల్లీకి గులాంలాగా కాంగ్రెస్ నేతలు పనిచేయాలసిందేనన్నారు. తప్పుడు హామీలతో ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు అలవాటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ది కుటుంబ పాలన.. గాంధీల పేరుతో కాంగ్రెస్ నేతలు కాలం వెల్లదీన్నారని తెలిపారు. సీఎం రేవంత్ ఇప్పటి వరకు 42 సార్లు ఢిల్లీ వెళ్లినా… ఇప్పటికి రాహుల్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. సీఎం రేవంత్ పదవి తుమ్మితే ఉడిపోయేలా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్తిక, సామాజిక పరిస్థితులు మెరుగుపడటం లేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దండుకోవాలని సీఎం, మంత్రులు, నేతలు చూస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. సీఎం రేవంత్… అరెస్ట్ లతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొసాల పునాదుల మీద ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్ వల్లే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం అయిందని తెలిపారు.
1984
