నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కొత్తగా నియమితులైన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను శనివారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. సీపీని కలిసిన వారిలో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కొండపాక రాజేష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ ఉన్నారు.
