27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు రౌడీల పాలన

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదని రౌడీల పాలన అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లా వ్యవహరిస్తూ రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కాంగ్రెస్ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కాంగ్రెస్ పార్టీ తన తీరును వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ రకమైన హింసతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ నిరాధారమైన ఆరోపణలకు భౌతిక దాడులను జోడించడం అత్యంత దిగజారిన రాజకీయ పద్ధతి అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై కుట్రపూరిత దాడిని ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి భహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ చెప్పుకునే ఇందిరమ్మ పాలన.. ప్రజా పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు రౌడీల పాలన అని ఘాటుగా విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు శాంతికి, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నా, తమ సహనాన్ని అసమర్థతగా భావించొద్దని ఇటువంటి చర్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజాధరణను తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ప్రధానమంత్రి పైన గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు.. తీవ్ర అసహనంతో.. తక్కువ కులంవాడు, చాయ్ అమ్ముకునే వ్యక్తి ఎలా ప్రధాని అవుతారు, మౌత్ కా సౌదాగర్, హిట్లర్ వంటి ఎన్నో పదజాల వాడారు.. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా వారి పార్టీ కార్యాలయాలపైనా లేదా వారి పార్టీ కార్యకర్తలపైనా దాడులు చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని బీజేపీ కార్యాలయాలపై దాడులు చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో బీజేపీకి ఉన్న ప్రేమ, ఆదరణ తగ్గదని కాంగ్రెస్ పార్టీ గ్రహించాలన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్  ,మాస్టర్ శంకర్ ,మాజీ కార్పొరేటర్ మాయావర్ సాయి రామ్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article