30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

స్థానిక  ఎన్నికల్లో కాంగ్రెస్ కు  ఓటమి తప్పదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని,స్థానిక  ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటవి తప్పదని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యనించారు.  వారం రోజుల్లో రైల్వే పనులకు నిధులు రాకుంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.  జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు.  పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన 72 గంటల్లోనే
కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.  అవగాహన లేకుండా నిధులు ఇవ్వడం లేదంటూ మహేష్ గౌడ్  మాట్లాడారని విమర్శించారు.  కేంద్రం ఇచ్చిన రైల్వే నిధులను పక్కదారి పట్టించారు.  ఎవరిని అడిగి బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చారని ప్రశ్నించారు.   రిజర్వేషన్లు సాధించే విధానం సరిగా లేదన్నారు. బీజేపీ పై బురద జల్లడం మానుకోవాలని సూచించారు.  వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పాలనలో కరప్షన్ పెరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ లో  క్లబ్బులు,పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగస్తున్నారని పేర్కొన్నారు.  బీఆర్ఎస్ హయాంలో దొంగ ఓట్లు, దొంగ పాస్ పోర్టులు జారీ  చేశారని ఆరోపించారు. ఈసమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article