29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శాంతియుత నిరసన

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం అన్నారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపు మేరకు బస్టాండ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మద్దికుంట దయానంద్, రాఘోత్తమ్ రెడ్డి, చింతకింది శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు పంగ రాజం, దేవదాస్, కిసారి లక్ష్మణ్, కూడలి ఎల్లం, కూడలి స్వామి, పంగ లింగం, రవి నాయక్, బాబురావు, గణేష్, శంకర్ నాయక్, దమ్లా నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

More articles

Latest article