రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శాంతియుత నిరసన
కామారెడ్డి, బతుకమ్మ : ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం అన్నారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపు మేరకు బస్టాండ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు,...