- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో గల్ఫ్ కార్మికుల మండల సొసైటీ అధ్యక్షులు ఎండి లాల్ మహమ్మద్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుందని అన్నారు. ఏడు దేశాలలో ఎలాంటి ప్రమాదాలలోనైనా తెలంగాణ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల భీమాను అందజేయడం జరుగుతుందన్నారు.తెలంగాణలో ఎక్కువగా జగిత్యాల, కోరుట్ల మెట్ పల్లి,నిజామాబాద్, సిరిసిల్ల ప్రాంతాల నుండి కార్మికులు బ్రతుకుదెరువు కోసం ఎక్కువగా విదేశాలకు వెళుతున్నారని అన్నారు.నిరుద్యోగులు అక్కడికి వెళ్లిన తదనంతరం ఉద్యోగాలు దొరకక రోడ్డు బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అలా జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను తీసుకుంటుందన్నారు.ఇటీవల గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను పంపించడం జరిగిందన్నారు. ఇప్పటికీ కొంతమంది కార్మికులు గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నారని అన్నారు.వారిని విడిపించడానికి వారికి విమానా టికెట్లను అందించడానికి ఎన్నారై పాలసీ విభాగం ఒక ప్రత్యేక కార్యాచరణను తీసుకుందన్నారు.గల్ఫ్ దేశాల్లోని మన భారత ఎంబసీలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి సహాయ సహకారాలు అందించడానికి కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నారై కార్మికుల కోసం ప్రత్యేక చొరవను చూపెట్టడం పట్ల అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,మార్పు సంజీవరెడ్డి,సుధమల్ల శ్రీనివాస్,చేపూరి రాజేశం,మెండే శ్రీనివాస్,గంట బుచ్చగౌడ్,గుడ్ల శ్రీనివాస్, సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.


