25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కారులో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : తాళాలు వేసి ఉన్న ఇండ్లను  కారు (నెంబర్ ప్లేట్ మార్చిన) లో వచ్చి చూసి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్రదొంగను అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యలయంలో విలేఖరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ…. ఆగస్టు 25న కామారెడ్డి పట్టణంలో మాసిరెడ్డి శివ అనే వ్యక్తి తన ఇంటిలో చోరీ జరిగిన విషయంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా శనివారం ఉదయం కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలొనీలో ఒక వ్యక్తి ఒక కారులో అనుమానాస్పదంగా తిరుగుతూ, తాళం వేసిన ఇండ్ల వద్ద తన కారు ఆపుతూ, అట్టి ఇండ్లను పరిశీలిస్తున్నాడని సమాచారం వచ్చింది. వెంటనే కామారెడ్డి టౌన్ పోలీసు వారు అక్కడికి వెళ్లి అట్టి అనుమానాస్పద వ్యక్తిని కారుతో సహా పట్టుకొని విచారించగా అట్టి కారు నెంబర్ ప్లెట్ తెలంగాణ)తో ఉన్నది కాని అట్టి వ్యక్తి హిందీ

Interstate thief arrested for stealing in a car

మాత్రమే మాట్లాడుతుండగా అనుమానంతో అట్టి కారు ఓనర్ వివరాలు తెలుసుకొని.. అతనితో ఫోన్లో మాట్లాడగా అట్టి వ్యక్తి రాజస్తాన్  రాష్ట్రం కరోలి జిల్లా తోడ భీం తాలుకా అజీజ్ పుర్ గ్రామానికి చెందిన హన్సరాజ్ మీనా గా గుర్తించారు. హన్సరాజ్ మీనా తన సహచరుడు అభిషేక్ తో కలిసి ఇటీవల కామారెడ్డి టౌన్ పరిధిలోని అశోక్ నగర్ ఏరియాలో జరిగిన ఇంటి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేరానికి ఉపయోగించిన కారు, దొంగతనం చేసిన కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగినది.   ఇద్దరూ నేరస్తులు గతంలో రాజస్థాన్ రాష్ట్రంలో పలు దొంగతనాలలో జైలు శిక్ష అనుభవించినట్లు తెలిసింది. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా దొంగతనాలు చేయాలని యత్నించినట్లు బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హన్సరాజ్ మీనా ను అరెస్టు చేసి తన వద్ద నుండి 2 తులాల బంగారు ఆభరణాలను స్వాధీన పరచుకొని నిందితుడిని న్యాయస్థానంలో  హాజరుపర్చడం జరుగుతుంది అని తెలిపారు.  మరో నిందితుడు అయిన అభిషేక్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పరిచినట్లు త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.  ఈ కేసు ధర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకోవడము లో చాకచక్యంగా, సమయస్పూర్తి తో వ్యవహరించిన కామారెడ్డి పట్టణ సీఐ నరహరీ, సిసిఎస్ సిఐ శ్రీనివాస్ లతో పాటు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినంధించారు.

Interstate thief arrested for stealing in a car

More articles

Latest article