కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుంది

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో గల్ఫ్ కార్మికుల మండల సొసైటీ అధ్యక్షులు ఎండి లాల్ మహమ్మద్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుందని అన్నారు. ఏడు దేశాలలో ఎలాంటి ప్రమాదాలలోనైనా తెలంగాణ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల భీమాను అందజేయడం జరుగుతుందన్నారు.తెలంగాణలో ఎక్కువగా జగిత్యాల, కోరుట్ల  మెట్...