29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

నిజామాబాద్ పట్టణంలోని సన్ ఫవర్ హైస్కూల్లో టీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.నా పుట్టిన గడ్డపై రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉంది” అన్నారు. రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఓటింగ్ శాతం పెరిగితే ప్రజలకు సేవ చేసే, క్వాలిటీ ఉన్న నాయకులు ఎన్నికవుతారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే గెలవాలని తన ఆకాంక్ష అని చెప్పారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.నిజామాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

More articles

Latest article