- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శారది సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాత్ నగర్ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో భేటీ అవుతూ, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రతి గల్లీ, ప్రతి వాడలో కాంగ్రెస్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం” అన్నారు. భూపతిరెడ్డితో పాటు ఈ ప్రచారంలో నిజామాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపి, యూత్ నాయకులు ఉమ్మాజి నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్, మాజీ సర్పంచులు భాగరెడ్డి, జనార్ధన్, చిన్న సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్, యువ నాయకుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
