నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద గల మహనీయుల ప్రాంగణంలో సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ మహారాజ్ 756 వ,జయంతి వేడుకలు మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల్కం గంగా కిషన్, నగర అధ్యక్షులు మంతెన దశరథ్,.జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టురు దేవదాస్ జిల్లా కోశాధికారి కొట్టూరు చంద్రకాంత్, నగర ఉపాధ్యక్షులు గట్ల సత్యం,నగర కోశాధికారి యెన్నుసుదర్శన్, సంయుక్త కార్యదర్శి మాడిశెట్టి లక్ష్మణ్, నగరంలోని పది తర్పాల అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు, హరిపాటు భక్తులు పాల్గొన్నారు.
