24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఏశాల సంధ్య సురేందర్ ఇంటింటి ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని రాకాసిపేట 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏశాల సంధ్య సురేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని, మౌలిక సదుపాయాల మెరుగుదల, డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొడ్ల రవీందర్ రెడ్డి, తూము రవీందర్ రెడ్డి, తోకలు సాయి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

 

 

Congress candidate Eshala Sandhya Surender campaigning from house to house in Bodhan

More articles

Latest article