26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ ఎన్నికల్లో రుద్రూర్ కాంగ్రెస్ నాయకుల జోరుగా ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. 16, 17 వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిలు బిట్ల సురేందర్, అఫ్రోజ్ లకు మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ రుద్రూర్ నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 16వ, 17వ వార్డులలో బరిలో ఉన్న బిట్ల సురేందర్, అఫ్రోజ్ లను గెలిపించాలని రుద్రూర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు పత్తిరాము అన్నారు. ఈ ప్రచారంలో రుద్రూర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారం, అక్కపల్లి నాగేందర్, సులేమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్, ఉప సర్పంచ్ శాదుల్, సదర్ లతీఫ్, హాబీబ్, అఖిల్, దిశ మెంబర్ అక్బర్నగర్ నగేష్, గోవింద్ రావు పటేల్, యూత్ కాంగ్రెస్ నితిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓరికే గంగారం, షేక్ సుభానీ, ఎండి.జమీల్, ఖలీమ్, బొప్పాపూర్ సర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్ లింగం, కుర్మాజీ సాయిలు, స్వామి, రుద్రూర్ వార్డు మెంబర్ ఇమ్రాన్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article