- ఆగస్టు 20వరకు గ్రామపంచాయతీ ముందు ఆందోళనలు
- 21నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు
- జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు ఆగస్టు05న ధర్నా
- సెప్టెంబర్10నఛలోసెక్రటేరియట్
- అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్)
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జి. కిషన్
సిరికొండ, బతుకమ్మ : ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఏ ఐ పీ కె ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తున్నట్లు ఏ ఐ పీ కె ఎం ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జి. కిషన్, సెక్రటరీ ఈ. రమేష్ లు వెల్లడించారు. శనివారంమండలంలోని గడ్కోల్ గ్రామంలో ఏ ఐ పీ కే ఎం ఎస్ జిల్లా కమిటీ సమావేశంను నిర్వహించి ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం చేపడుతున్న ఆందోళన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ఆందోళన ఉదృతం చేసే కార్యక్రమం లో భాగంగా ఆగస్టు20వరకు గ్రామపంచాయతీ ముందు ఆందోళనలు, 21నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు, ఈ నెల 5 న జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, సెప్టెంబర్10న ఛలోసెక్రటేరియట్ కార్యక్రమాలను చేపడ్తున్నట్టు వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికి ఆ హామీ అమలు చేయడంలో మీనావేశాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని వ్యవసాయ కూలీలను ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో వ్యవసాయ కార్మికులు ఉండగా తూతూ మంత్రంగా అక్కడక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఇందిర ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రతి వ్యవసాయ కూలికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయకులకు ఇవ్వాల్సిన ఇందిరా ఆత్మీయ భరోసా సంపూర్ణ అమలు కోసమే ఈ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తాము ఆందోళనలు చేపడుతున్నట్లు, ప్రభుత్వం దిగి రాకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఏఐపీకేఎంఎస్ పిలుపుని అందుకుని వ్యవసాయ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కే. రాంజీ, జి. బాల్ రెడ్డి, సహాయ కార్యదర్శులు జి. సాయిరెడ్డి, ఏ. అశోక్, డి. దయల్ సింగ్,జి. ఎర్రన్న,కోశాధికారి ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.